సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘన నివాళులు
ఆపరేషన్ పోలోతో రజాకర్ల కల చెదిరిపోయింది
* దక్షిణ పాకిస్తాన్ కోసం కలలు కన్న కాసిం రాజ్వి
* సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో తోకముడిచిన నైజాం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తికై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో (పోలీస్ చర్య) ప్రారంభించిన సెప్టెంబర్ 13 దినం సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి బిజెపి శ్రేణులందరూ పూలమాలలు వేసి , నివాళులర్పించి , ఆయన సేవలను ,పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకొని, స్మరించుకున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ పాకిస్తాన్ ( ప్రస్తుత పాకిస్తాన్), తూర్పు పాకిస్తాన్ ( ప్రస్తుత బంగ్లాదేశ్) తో సరితూగేలా దక్షిణ పాకిస్తాన్( నిజాం సంస్థానం) అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించడం కోసం ఈ రజాకార్ల సైన్యం కలలు కందన్నారు. దక్షిణ పాకిస్తాన్ కోసం కలలు కన్నా ఆనాటి నిజాం కాసిం రాజ్వి కి తగిన గుణపాఠం చెప్పడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్1948 సెప్టెంబర్ 13 న చేపట్టిన ఆపరేషన్ పోలోతో ( పోలీసు సైనిక చర్యతో) ఆయన అప్పటి రజాకర్ల మెడలు వంచారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వానికి నిజాం రజాకర్లు తలోగ్గ టంతోనే సెప్టెంబర్ 17న తెలంగాణకు అసలైన స్వాతంత్రం లభించిందన్నారు. అలాంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాల్సిన బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం నైజాం రజాకర్ వారసుల ఎంఐఎం పార్టీ కి తలోగ్గి తెలంగాణ స్వాతంత్ర వేడుకలు అధికారికంగా చేపట్టకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే నేడు తెలంగాణ స్వాతంత్ర వేడుకలను సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తర్వాత ఇన్నాళ్లు మొద్దు నిద్రలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం మేల్కొని తెలంగాణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కొరటాల శివరామకృష్ణయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు యెన్నం ప్రకాష్, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి, కిసాన్ ముర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు మంథని కిరణ్, జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి ,ఆవుదుర్తి శ్రీనివాస్, వరాల జ్యోతి, మామిడి రమేష్ చైతన్య, మావురపు సంపత్, లడ్డు ముందాడ, మురళి, రాగి సత్యనారాయణ, తణుకు సాయి కృష్ణ, మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు