సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనను కొనసాగిద్దాం

– తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. నర్సింహ్మ గౌడ్
– ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు
– పాల్గొన్న జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్

మక్తల్, ఆగస్టు 18( జనం సాక్షి న్యూస్)

తెలంగాణ తొలి విప్లవకారుడు బహుజనుల రాజ్యం కోసం గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దామనీ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నర్సింహాగౌడ్ పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి వేడుకల సందర్భంగా గురువారం నాడు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ హరిచందన గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యం కోసం నిరంతరం పోరాడారని అన్నారు. మొగల్ చక్రవర్తి కి వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోట పై జెండా ఎగురవేసి ఒక సంవత్సరం పాటు పాలన సాగించడం జరిగిందన్నారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తన ఆశయం సాధన కోసం నిరంతరం శ్రమించిన మహోన్నథవ్యక్తి అని వారు కొనియాడారు. పెత్తందారీ తనం , దౌర్జన్యం ,బలవంతపు వసూళ్లకు వ్యతిరేకంగా ఎదురుతిరిగి తన స్నేహితులతో కలిసి పోరాటం చేసిన మహా పోరాటయోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. అలాంటి మహా పురుషుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరముందన్నారు. మూడు వందల సంవత్సరాల కిందట ఎంతో పోరాటం చేసిన సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు మరుగున వేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం పరంగా నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు ఆయన చరిత్రను ప్రతి ఒక్క బహుజనుడు తెలుసుకొని ఆయన స్ఫూర్తి తో ముందుకు వెళ్లాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ మక్తల్ నియోజకవర్గం నాయకులు చెన్నయ గౌడు చందాపుర్ అశోక్ గౌడు రాజా గౌడు రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు