సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) :సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిపారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భూక్యరాధ, ఎంపీడీవో డి బాలరాజు, ఎం పి ఓ జేఎల్.జి గాంధీ, కార్యాలయ పర్యవేక్షకుడు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు తదితరులు పాల్గొన్నారు.