సర్పంచ్‌ భర్తల పెత్తనం ఉండరాదు: ప్రధాని

3
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి):

సర్పంచ్‌ భర్తల సంస్కృతి నశించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు సర్పంచులుగా ఉంటే ఆ బాధ్యతనంతా వారే నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. వారి  బదులుగా భర్తలు రాజ్యమేలే కాలం పోవాలన్నారు.  జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘గాంధీజీ దేశాభివృద్ధికి ప్లలెలే పట్టుకొమ్మలన్నారు. ఆయన మాటలను మనం గౌరవించాలి. ప్లలెల అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి గ్రామం వచ్చే పదేళ్లలో ఏమేం సాధించాలో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కోసం పనిచేయాలి. ప్లలెల్లో బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉండటం కలవరపెడుతోంది. వారందరినీ బడిలో చేర్పించేలా గ్రావిూణులే నడుంబిగించాలి’ అన్నారు. స్త్రీ స్వాతంత్య్రానికి భంగం వాటిల్లకుండా చూడాలన్నారు. వారు ఎంతో తెలివైన వారని, వారికి పాలన తెలుసన్నారు.