సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాడుదాం
గీత కార్మికులకు “గీతన్న బంధు”బైకులు అందించాలి.
– కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి. రమణ
డోర్నకల్ సెప్టెంబర్ 15 జనం సాక్షి
కల్లుగీత కార్మికుల సమస్యలపై సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటం చేయాలని కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ అన్నారు.ఈ సందర్భంగా గురువారం అఖిలభారత కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్క ఆయిలి వెంకన్నతో కలిసి డోర్నకల్ మండల పరిధి గొల్లచర్ల గ్రామంలో పాపన్న స్ఫూర్తితో అమరుల యాది మండల మహాసభలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం కల్లుగీత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి సామాజిక సమానత్వం కోసం పోరాడి శ్రామిక రాజ్యం సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులందరికీ వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, సంవత్సరంలో వృత్తి ఆరునెలలే ఉంటున్నందున మిగతా కాలం జీవించడానికి “గీతన్న బందు” పేరుతో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రతి జిల్లాలో నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గౌడ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు.కల్లులోని పోషక విలువలను ప్రభుత్వమే ప్రజలకు తెలియజేయాలన్నారు.అక్టోబర్ 19,20న రాష్ట్ర 3వ మహాసభలు భువనగిరి జిల్లా యాదాద్రి గుట్టలో నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి గౌడ్ అన్నల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.50 సంవత్సరాలు పైబడిన వారికి 5000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాల వలన చెట్లు ఎక్కకపోవడంతో గీత కార్మికులు నష్టపోయారు.వీరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కల్లుగీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న,మాజీ ఎంపీపీ మేకపోతుల రమ్య శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బోయినపల్లి వెంకన్న,జెడ్పీటీసీ కమల రామనాధం,మాజీ సర్పంచ్ గంధంసిరి ఉపేందర్,మండల కార్యదర్శి గాదె నాగేశ్వరావు,బొల్లగాని వీరాలక్మి,మేకపోతుల శ్రీనివాస్,గందసిరి శ్రీనివాస్ గౌడ్ పెద్ద గౌడ,వివిధ గ్రామాల గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|