సర్వేలన్నీ పైళ్లకే అనుకూలం

 

ప్రజల్లో ఆయనకు ఎనలేని అభిమానం

భారీ మెజార్టీతో గెలిపించాలన్న సిఎం కెసిఆర్‌

యాదాద్రి భువనగిరి,నవంబర్‌21(జ‌నంసాక్షి): సర్వేలన్నీ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌ రెడ్డికి అనుకూలమని చెబుతున్నాయని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. పైళ్ల పేరు చెబితేనే అంతా మంచి మనిషని అంటున్నారని అన్నారు. దివంగత మాధవరెడ్డి తరవాత ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ సాధన కోసం ఇదే మైదానంలో అనేక సభలు పెట్టినమని భువనగిరి నియోజకవర్గస్థాయి సభలో సీఎం కేసీఆర్‌ అన్నారు. సభలో సీఎం మాట్లాడుతూ..సంక్షేమ పథకాలన్నీ విూ కళ్ల ముందే ఉన్నాయి. రైతాంగానికి 24 గంటల నిరంతర కరెంట్‌ ఇస్తున్నం. రైతు బంధు పథకం కింద వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.10 వేలు ఇస్తమన్నారు. కాళేశ్వరం నీళ్లతో భువనగిరిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరిస్తమని సీఎం స్పష్టం చేశారు. మాధవరెడ్డి నాకు ఆత్మీయ మిత్రుడు. మాధవరెడ్డి చేసిన సేవ మరువలేనిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. పైళ్ల శేఖర్‌ రెడ్డిని కూడా నియోజకవర్గ ప్రజలు దేవుడిలా భావిస్తున్నరని అన్నారు. ప్రజలంతా ఆశీర్వదించి శేఖర్‌ రెడ్డిని గెలిపించాలని సీఎం కోరారు. భువనగిరిని జిల్లాగా చేసుకున్నామని, యాదాద్రిని అద్భుతమైన పుఎణ్యక్షేత్రంగా అభివృద్ది చేసుకుంటున్నామని అన్నారు. సవిూకృత కలెక్టరేట్‌ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో మూసీ నదిని మంచినీటి నదిగా మారనుందన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఉమా మాధవరెడ్డి,ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు