సర్వేసభ్య సమావేశాలకు అధికారులు సరియైన సమయానికి రావాలి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21:: మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు సరి అయిన టైం కు రావాలని లేనిచో వారి మీద పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మనోహర్ బద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నవనీత రవి అధ్యక్షతన జరిగింది సర్వే సభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనప్పటికీ అధికారులు ఆలస్యంగా వస్తున్నారని వచ్చి సమావేశంలో సరైన టైమ్ కు అధికారులు అందరూ హాజరు కావాలని ఎంపీటీసీలు సర్పంచులు సరియైన టైం హాజరు కావాలని ఆమె కోరారు ప్రతి గ్రామంలో క్రీడాకార ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని అందుకు సరైన స్థలాల ఎంపిక చేయాలని ఎంపీడీవో యాదగిరి రెడ్డి పేర్కొన్నారు ఇప్పటివరకు వెంకటాపూర్ అగ్రహారం కూచారం రామయ్యపల్లి గ్రామాలలో మాత్రమే క్రీడ ప్రాంగణాలు ఉన్నాయని మరికొన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు స్థలం ఎంపిక చేసి ఆధీనం చేయాలని కోరారు గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు లేనందున గ్రామ కంఠం మరియు శిఖం స్థలాలను గుర్తించామని ఆ స్థలాలను వెంటనే క్రీడ స్థలాలకు ఎంపిక చేస్తున్నట్లు తాసిల్దార్ బిక్షపతి తెలిపారు ఇప్పటివరకు 13 గ్రామపంచాయతీలలో క్రీడాస్థలాలు గుర్తించామని ఆయన తెలిపారు ఓటర్ కార్డుకు ఆధార్ లింకు చేయడంలో ప్రజా ప్రతినిధులు సహకరించాలని తాసిల్దార్ బిక్షపతి తెలిపారు తమకు సరైన సిబ్బంది లేనందున ఓటర్ ఐడి కి ఆధార్ లింకు చేపించడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు కొత్త ఓటర్లు నమోదు చేసుకునేవారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు గొర్రెలకు నీలి నాలుక మరియు పాకుడు వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నందున వాటికి ముందస్తు టీకాలు ఇచ్చినట్లు పశువైద్యాధికారి రాజారాం తెలిపారు ఈ సంవత్సరం ఐదు క్వింటాళ్ల పసుపు విత్తనాలు పంపిణీ చేశామని తెలిపారు గొర్రెల అవసరమున్నవారు గొర్రె సంఘాల ఆధ్వర్యంలో 43750 కరితే గొర్రె యూనిట్లు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు కాలకల్ గ్రామపంచాయతీ కి శంకుస్థాపన చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణం చేపట్టడం లేదని 15 రోజుల క్రితం అధికారులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు పనులు చేపట్టడం లేదని వెంటనే పనులు ప్రారంభించేటట్లు కాంట్రాక్టర్ ఆదేశించారని కాల్ సర్పంచ్ నెత్తి మల్లేష్ పేర్కొన్నారు ఆ కాంట్రాక్టర్ సిసి రోడ్డు పనులను చేస్తున్నాడని పంచాయతీ భవనం చేయడం లేదని అతను చేనుచో పంచాయతీ ద్వారా తమ నిర్మాణం చేపటం దానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన సూచించారు ఈ విషయంపై వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభం అయ్యేటట్లు చేస్తానని ఏ ఈ జంకిలాల్ పేర్కొన్నారు బతుకమ్మ సంబరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బతుకమ్మ చీరలు వచ్చాయని త్వరలో గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేస్తామని తెలుగుదేశం కార్డుదారులకు ఒక్క చీర పంపిణీ చేయనున్నట్లు ఐకెపి ఈపిఎం పెంటా గౌడ్ పేర్కొన్నారు ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు విట్టల్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు