సర్వే పేరుతో మరమారు దగా : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూముల సర్వే పేరుతో రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. రైతులకు సాయం ప్రకటించిన తరవాతనే దీనిని తెరపైకి తేవడం చూస్తే ఆంతర్యం అర్తం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టులపై ప్రజలను మోసం చేసే రీతిలో అధికార టిఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో దండుకునే కార్యక్రమం సాగుతోందన్నారు. రీ డిజైన్ల పేరుతో ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే సమాయత్తం కావ్వాలని అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తమవంతుగా కృషిచేస్తున్నామని అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ఆందోళనల కారణంగా ప్రల్లో ఆలోచనలో మార్పు వస్తోందని అన్నారు. కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్‌ ముందుంటుందని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన హావిూలన్నింటినీ విస్మరిస్తోందని అన్నారు. దళితులను ప్రభుత్వం విస్మరిస్తోందని, దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి మాటలకే పరిమితం అయ్యిందని ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన మాటను కేసీఆర్‌ మరిచారని, ఆసీటుపై ఆయనే కూర్చున్నారన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం మాటల్లోనే ఉందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఎద్దేవాచేశారు.