సహకార జెండాను ఆవిష్కరించిన పీఏసీఎస్ చైర్మన్.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: వందవ అంతర్జాతీయ సహకార దినోత్సవ సందర్బంగా శనివారం రోజున మండలంలోని కుమారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ సహకార పథకంను ఎగరావేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడు అంచెలుగా సాగుతున్న రాష్ట్ర, జిల్లా,ప్రాథమిక అను ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘం వలన ప్రాథమిక స్థాయిలోని గ్రామీణ ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ రైతులకు అండగా నిలిచి వ్యవసాయ అవసరాలు ఎరువులు విత్తనాలు తక్కువ వడ్డీకి ఋణాలు ఇచ్చి ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ఆగడాల నుండి తప్పించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు మందుల రమేష్ తోపాటు డైరెక్టర్లు సిఈఓ రైతులు తదితరులు పాల్గొన్నారు.