సహకార సంఘాలు సొసైటీలు టిఆర్ఎస్ హయంలోనే బలోపేతం

సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి

మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం భవనంలో మహాజన సభ నిర్వహించారు.ప్రాథమిక సహకార సంఘాలు టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే బలోపేతం చేయడం జరిగిందని,గత ప్రభుత్వాలు ఆయంలో సొసైటీలు నిర్వీర్యం చేశారని,రైతులు రుణాలు తీసుకొని సొసైటీకి సహకరించాలన్నారు.వడ్లు కొనుగోలు ద్వారా రైతుల నుండి మూడు కోట్ల 43 లక్షల రూపాయలు ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. రైతులకు ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం జరిగిందని,ఇప్పటివరకు క్రాప్ లోన్లు ద్వారా గత సంవత్సరం 50 లక్షలు ఇవ్వడం జరిగింది అన్నారు.రైతులకు రెండు కోట్ల 23 లక్షలు లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సీజన్లో కొత్త రుణాలు కొన్ని నిబంధనలు కారణంగా ఇవ్వడం లేదన్నారు. ఎల్ టి లోన్లు రైతుల నుంచి వసూలు చేయడం జరుగుతుందని,తద్వారా సొసైటీ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.2022 2023ఆర్థిక సంవత్సరపు అంచనా బడ్జెట్ ను ఆమోదించారు. ఎల్టి లోన్లు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వచ్చే డిసెంబర్ 31 తేదీ వరకు చెల్లించాలని,రైతులందరూ సద్వినియోగం చేసుకోగలరని చైర్మన్ రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకోబు,సింగిల్ విండ్ వైస్ చైర్మన్ విష్ణు, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు నరేందర్,మధుసూదన్, ఎంపిటిసి రాజు,సీఈవో కిరణ్ కుమార్ రెడ్డి,ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సిద్ధి నరసింహులు,సింగల్ విండో డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.