సహారా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది, రూ.24 వేల కోట్ల మదుపరుల వివరాలను సెబీకి అందించాలని సుప్రీంకోర్టు గతంలో సహారా సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే.