సాగర్‌ గ్రాండ్‌ కబ్జా

3

ఓయూ విద్యార్థుల దాడి

హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): ఉస్మానియా ఆక్రమణ భూములపై ఓయూ విద్యార్థులు యుద్దం ప్రకటించారు. ఓయు భూముల పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించారు. ఇందులో భాగంగా  హబ్సిగూడలోని స్వాగత్‌ గ్రాండ్‌ ¬టల్‌పై కొందరు ఓయూ విద్యార్థులు సోమవారం  రాళ్లతో దాడి చేశారు. హబ్సిగూడలోని  స్వాగత్‌గ్రాండ్‌ ¬టల్‌ టీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందినది. దీనిపై పలువురు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ఉదయం దాడి చేశారు. దీంతో ¬టల్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ¬టల్‌ యాజమాన్యం ఉస్మానియా యూనివర్శిటీ భూములను ఆక్రమించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓయూలో ఉన్న ఖాళీ భూములను పేదలకు ఇస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యల వేడి ఇంకా సద్దుమణగలేదు. రోజు రోజుకు విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. తాజాగా స్వాగత్‌ గ్రాండ్‌ ¬టల్‌ పై ఒక్కసారిగా దాడికి దిగారు. అద్దాలు..ఫర్నీచర్‌ ను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓయూ భూముల్లో నిర్మాణాలను తొలగించాలని, భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడకు చేరుకున్న విద్యార్థులను అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే ఆరాధన థియేటర్‌ నుంచి హబ్సీగూడ వరకు ఉన్న కట్టడాలన్నీ ఓయూ ఆక్రమణ భూముల్లో నిర్మించినవేనని విద్యార్థులు ఎంతోకాలంగా ఆరోపిస్తున్నారు. దీంతో  ఓయూ భూములను ఆక్రమించుకుని ముత్తిరెడ్డి  ప్వాగత్‌ గ్రాండ్‌ ¬టల్‌ను నిర్మించారంటూ విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారు. ¬టల్‌ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తార్నాక, ఓయూ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతకొన్ని రోజులుగా ఉస్మానియా భూములకు సంబంధించి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉస్మానియాకు సంబంధించిన భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడంతో విద్యార్థిలోకం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైంది. ఓయూ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ¬టళ్లు, కాంప్లెక్సులు నిర్మించిన వారి అంతుచూస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ముందుగా వీరి భరతం పట్టాలని సిఎం కెసిఆర్‌ను వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమిత భూముల్లో ¬టల్‌ను నిర్మించారంటూ హఠాత్తుగా ¬టల్‌పై రాళ్లదాడి చేశారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో అంతా నివ్వెరపోయారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని స్వల్ప లాఠీచార్జి జరిపి విద్యార్థులను చెదురగొట్టారు. దాడికి పాల్పడిన పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ భూములను పరిరక్షించాలంటూ లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. తమ విశ్వవిద్యాలయ భూములను కబ్జా చేసి అందులో అక్రమ కట్టడాలు కట్టినవారు వెంటనే ఖాళీ చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. హబ్సీగూడాలోని స్వాగత్‌ ¬టల్‌ మొదలు ఇతర ఆక్రమణలను సైతం వదలబోమని హెచ్చరించారు.  విశ్వవిద్యాలయ భూముల్లో ¬టల్‌ నిర్మించారని, వెంటనే దానిని తొలగించాలని నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, అంగుళం ఆక్రమించినా క్షమించబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఉస్మానియాపై ఎవరు కన్నేసినా క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.తెలంగాణ విద్యార్థి విభాగం (టీవీవీ)వంటి కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ దాడి చేశారు.

ప్రస్తుతం ఈ అంశం నివురుగప్పిన నిప్పులా ఉన్నా మళ్లీ తెలంగాణ నాటి ఉద్యమ తీవ్రతను అందుకోగలదని భావిస్తున్నారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వాళ్లే పట్టుకొమ్మలుగా నిలిచి, కొందరు తమను మరచినా విద్యార్థులు మాత్రం పోరుబాట వీడలేదు. తాజాగా తమ భూముల కోసం, కొలువుల కోసం మరోసారి పోరు సింహాలై గర్జిస్తున్నారు. ఎందరో విద్యార్థులను పోరుబాట పట్టించిన పోరుగడ్డ. ఉద్యమాలకు ఊపిరూదిన జీవగడ్డ. మరోసారి యుద్ధభూమిగా మారుతోంది. ఒకప్పుడు ప్రత్యేక ఉద్యమ సారథికి నీరాజనం పట్టిన విద్యార్థి లోకం ఇప్పుడు భూమల కోసం పోరుబాట పడుతోంది. ఉస్మానియా భూములపై అటు పాలకులకు, ఇటు విద్యార్థులకు మాటలయుద్ధం జరుగుతోంది. ఓయూ జోలికొస్తే సహించేది లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్‌ వేయకుండా తాత్సారం చేస్తున్న సర్కార్‌పై సమరభేరీ మోగిస్తున్న విద్యార్థులు తాజాగా కేసీఆర్‌ తీరుపై మండిపడుతున్నారు. ఓయూ భూముల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడితే ఉద్యమం తప్పదని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇక ఉస్మానియా వర్సిటీ భూముల వివాదంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌  కూడా స్పందించారు. పేదల ఇళ్ల కోసం వర్సిటీ భూములే తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భూ పోరాటానికి ఆర్‌. కృష్ణయ్య,తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌ చెరుకు సుధాకర్‌  మద్దతు పలికారు. విద్యార్థి ఉద్యమాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ వారినే మరిచిపోయారని మండిపడ్డారు. ఓయూ భూములపై కేసీఆర్‌కు ఎలాంటి హక్కూ లేదని, భూములను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేసే విద్యార్థులపై ప్రభుత్వం నాన్‌బెయిల్‌ కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ రామచంద్రారావు పేర్కొన్నారు. విద్యార్థుల తరఫున తాను  వాదిస్తామంటూ ప్రకటించారు. సొంత కుటుంబంలో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చుకున్న సిఎం కెసిఆర్‌ తెలంగౄణ కోసం పోరాడిన విద్యార్తులను మరచారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తమను విస్మరించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులుగా ఏ విధంగా ముందుడి నడిపామో…? తెలంగాణ పునర్నిర్మాణానికి,ఓయూ భూమలు పరిరక్షణకు కూడా ముందుండి  పోరాడుతాన్నారు.