సాగర్ జలాల విడుదల సీఎం సానుకూలం: మంత్రి జానా
హైదరాబాద్: నీటి లభ్యతను బట్టి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిజోన్‌లో రబీకి నీటిని విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్షను ముఖ్యమంత్రి నిర్వహించి విడుదలపై ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.సీఎంతో భేటీ అనంతరం జానారెడ్డి బుధవారం మీడియాతో మాట్టాడారు. గత మూడు సీజన్లలో నల్గొండ జిల్లాకు నీరందక రైతులు పడిన ఇబ్బందులను దృష్టలో ఉంచుకుని సర్కారు నిర్ణయం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు జానా వెల్లడించారు.