సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
– బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జులై21(జనం సాక్షి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనాయపల్లి గ్రామ సవిూపంలో భీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్ బండ్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం పరిశీలించారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి భీమ రెండో దశ ద్వారా రెండు రోజులుగా శంకర సముద్రం, రంగ సముద్రం రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రెండు రిజర్వాయర్లను నింపి వానాకాలం పంటకు సరిపడ నీటిని నిల్వ చేయాలని నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నీటితో వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. కరెంట్
ఖర్చుతో లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో పొదుపుగా వాడుకోవాలని నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. సరిపడినంత నీరు అందుబాటులోకి వస్తుండటంతో రైతులు ఆనందంతో సాగు మొదలుపెట్టారు.