సాధారణ కాన్పులను ప్రోత్సహించాలి : జిల్లా వైద్యాధికారి చందు నాయక్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో
సాధారణ కాన్పులను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ అన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులు డాక్టర్లు, వైద్య సిబ్బందితో కలిసి అయిజ ప్రభుత్వ ఆస్పత్రి నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. అయిజలో ప్రధాణంగా సిజేరియన్ కాన్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఇలా చేస్తే భవిష్యత్లో సామాన్య జనం ఇబ్బందు లకు గురి అవుతారని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల వారిగా ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, చేసిన కాన్పులు వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాన్పుల కోసం ప్రవేటు ఆస్పత్రులకు, సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహించిన వారిని మందలించారు. ప్రవేటు ఆస్పత్రులలో సాధారణ కాన్పులు మాత్రమే చేయాలన్నారు. ప్రణాపాయ స్థితిలో ఉంటే జిల్లా ఆస్పత్రికి పంపించాలని తెలిపారు. నిబంధన లకు విరుంగా ప్రవేటు ఆస్పత్రులు పనిచేస్తే చట్టరీత్య చర్యలు ఉంటాయని అన్నారు. ప్రజల పట్ల బాధ్య తాయుతంగా ఉండాలని, వారి ఆరోగ్యాలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత సైతం మనదే అన్నారు. వారికి సకాలంలో మందుల అందించి వారు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలన్నారు. గరిణులను, వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తు ఉండాలని తెలిపారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిజ డాక్టర్ రామలింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు
Attachments area