సాధారణ పరిస్థితుల దిశగా కాశ్మీర్‌

అభివృద్దిలో భాగం కాలేక పోతున్న నేతలు
శ్రీనగర్‌,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ మూడేళ్ల క్రితం తీసుకున్నచర్యలతో కాశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. మెజార్టీ ప్రజలు కేంద్ర నిర్ణయాన్ని సమర్థించాయి. దీనిని అడ్డం పెట్టుకుని మారణహఓమం సషృª`టించారు. ఇక్కడ పాలించిన నేతలు లగ్జరీలు అనుభవించారు. జమ్మూ`కశ్మీరు మహారాజు
హరిసింగ్‌ 1927, 1932లలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా పాలితులు, వారి హక్కులను నిర్వచించారు. ఆ రాజ్యానికి వలస వెళ్ళినవారి హక్కులను కూడా క్రమబద్ధీకరించారు. దేశ విభజన సమయంలో 1947 అక్టోబరులో రాజా హరిసింగ్‌ భారత దేశంలో తన రాజ్యాన్ని విలీనం చేశారు. అయితే అప్పటిక కొంత భాగాన్ని పాక్‌ ఆక్రమించుకుంది. అదే ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్‌గా మిగిలింది. 1952 ఢల్లీి అగ్రిమెంట్‌ ప్రకారం కొన్ని రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1954లో జమ్మూ`కశ్మీరుకు వర్తింపజేశారు. ఈ అగ్రిమెంట్‌ను షేక్‌ అబ్దుల్లా, జవహర్లాల్‌ నెహ్రూ కుదుర్చుకున్నారు. అదే సమయంలో అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు. 1956లో జమ్మూ`కశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిలో గతంలో మహారాజా నిర్వచించిన శాశ్వత నివాసుల నిర్వచనాన్ని యథాతథంగా ఉంచారు. దీని ప్రకారం 1911కు పూర్వం రాష్ట్రంలో జన్మించిన లేదా స్థిరపడిన అందరూ శాశ్వత నివాసులవుతారు. లేదంటే, 1911కు పూర్వం పదేళ్ళ నుంచి ఆ రాష్ట్రంలో నివసిస్తూ చట్టబద్ధంగా స్థిరాస్తిని సంపాదించుకున్నవారు కూడా శాశ్వత నివాసులవుతారు. జమ్మూ`కశ్మీరు నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్ళిపోయినవారిని రాష్ట్ర పాలితులుగానే పరిగణిస్తారు. వారి రెండు తరాల సంతతిని రాష్ట్ర
పాలితులుగానే పరిగణిస్తారు. భారత దేశంలో విలీనమైన తర్వాత జమ్మూ`కశ్మీరు షేక్‌ అబ్దుల్లా పాలనలోకి వచ్చింది. ఆయన 1949లో భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, రాజ్యాంగంలో అధికరణ 370ని చేర్చేలా చేశారు. ఈ అధికరణ ద్వారా ఆ రాష్టాన్రికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తోంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగతావన్నీ జమ్మూ`కశ్మీరు అధికార పరిథిలోనే ఉంటాయని ఈ అధికరణ చెప్తోంది. ఇంతవరకు 370 కారణంగా పర్మినెంట్‌ రెసిడెంట్‌ చట్టం వల్ల శాశ్వత నివాసులు కానివారు ఆ రాష్ట్రంలో స్థిరపడటం నిషిద్ధం. స్థిరాస్తిని కూడా సంపాదించుకోకూడదు, ప్రభుత్వోద్యోగాలు, ఉపకార వేతనాలు, ఇతర సహాయాలు పొందడానికి హక్కులు ఉండవు. మరోవైపు జమ్మూ`కశ్మీరు మహిళలు నాన్‌ పర్మినెంట్‌ రెసిడెంట్స్‌ను వివాహం చేసుకుంటే, ఆ మహిళలకు రాష్ట్ర పాలితులుగా ఉండే హక్కులు లభించవు. ఈ హక్కులు ఇటువంటి మహిళలకు వర్తించవు. అయితే 2002 అక్టోబరులో ఆ రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరట ఇచ్చింది. నాన్‌ పర్మినెంట్‌ రెసిడెంట్స్‌న వివాహం చేసుకునే మహిళలు తమ హక్కులు కోల్పోరని, వారి సంతానానికి మాత్రం వారసత్వ హక్కులు ఉండవని తెలిపింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 35ఏ ప్రకారం జమ్మూ`కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాశ్వత నివాసులను నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకు ఈ అధికరణ ద్వారా లభిస్తోంది. ఈ అధికరణను 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భారత రాజ్యాంగంలో చేర్చారు. కాగా, ’వుయ్‌ ద సిటిజెన్స్‌’ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికరణ 35ఏను రాజ్యాంగంలో చేర్చిన తీరును ప్రశ్నించింది. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవలసి ఉండగా, అటువంటి సవరణ జరగకుండానే అధికరణ 35ఏను చేర్చారని ఆరోపించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, వెంటనే అమల్లోకి రాలేదని తెలిపింది.