సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ …తపాలా శాఖ లో నూతన పథకం
దేవరుప్పుల ,అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలకేంద్రంలోని ఉప తపాలా కార్యాలయంలో గ్రామీణ తపాలా ఉద్యోగులకు ప్రమాద భీమా అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యతిధిగా హన్మకొండ డివిజన్ తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ బి.నంద పాల్గొని మాట్లాడుతూ తపాలా శాఖ నూతన పథకం అమలుకై శ్రీకారం చుట్టిందని..
తక్కువ ప్రీమియంలో ఎక్కువ ప్రయోజనం పొందేవిధంగా ఒక సంవత్సరానికి కేవలం 399 రూపాయలు చెల్లిస్తే ఆ సంవత్సరంలో ప్రమాదవశాత్తు పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆకుటుంబం పది లక్షల రూపాయలను పొందవచ్చని..18-65 మధ్య సంవత్సరాలు కలిగిన వారికి ఈభీమా వర్తిస్తుందని..
ఆధార్ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ ఈ భీమాకు అర్హులని ఈ భీమా తీసుకున్న వారు అనారోగ్య భారినపడితే ఆరోగ్యభీమా ఆసుపత్రి ఖర్చులను చెల్లిస్తుందని భీమా పొందిన వ్యక్తి మరణిస్తే వ్యక్తిగత భీమా ఆ కుటుంబానికి 25 వేల రూపాయలు, అంత్యక్రియలకు 5వేలు అందిస్తుందని కావున ప్రజలు ఈ భీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో జనగామ ఈస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ పి.అశోక్ కుమార్,ఎస్పీఎమ్ఏ రవికుమార్,తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Attachments area