సామూహిక ప్రమాద బీమా ని అందరూ తీసుకోవాలి.
-రూ 399 చెల్లిస్తే 10 లక్షల బీమా.
బెజ్జంకి,అక్టోబర్18,(జనంసాక్షి ):మండల కేంద్రంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పోస్టల్ సిబ్బందితో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేళా నిర్వహించడం జరిగింది.తపాలా శాఖ ద్వారా సామూహిక ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తపాలా శాఖ అధికారులు తెలిపారు.కేవలం 399 రూపాయలతో కడితే 10 లక్షల ప్రమాద భీమా చేసేల టాటా ఏఐజి,బజాజ్ ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలియజేశారు.పాము కాటు,కరెంట్ షాక్,యాక్సిడెంట్,పైనుండి పడటం,గ్యాస్ పేలడం,ఇతర అనుకొని సంఘటనల వల్ల చనిపోయిన,అంగ వైకల్యం పొందిన 10 లక్షల రూపాయలు భీమా పొందవచ్చు అని అన్నారు.ప్రమాదాల వలన హాస్పిటల్ లొ చేరినప్పుడు అడ్మిట్ అయితే 60 వేల వరకు ఔట్ పేషెంట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే 30 వేల వరకు ఆసుపత్రి ఖర్చులు పొందవచ్చు.ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోని బీమా సౌకర్యాన్ని అతి తక్కువ ప్రీమియంతో సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలను తపాలా శాఖ సిబ్బంది కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్పిఎం ఎం వీరన్న,బీపీఎం లు
ఎస్ కృష్ణవేణి,విష్ణు,కిరణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.