సాయంత్రానికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ తొలిరౌండ్‌ ఫలితం

నల్లగొండ, మార్చి 25: నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తొలి రౌండ్‌ ఫలితం సాయంత్రం ఆరు గంటలకు వెల్లడించే అవకాశం ఉంటుందని కౌంటింగ్‌-రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాత్రంతా కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా యూటీఎఫ్‌-సీపీఎమ్‌ బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్‌ ఇప్పటి వరకూ 5,037 ఓట్లు అనుకూలంగా వచ్చాయి.