సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి

 *సీపీఐ అధ్వర్యంలో ఈనెల 16న నల్లగొండ జిల్లా కేంద్రంలో వారోత్సవాల సభ
 నల్లగొండ బ్యూరో. జనం సాక్షి :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను  విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దూమ్ భవనంలో మంగళవారం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిజం సర్కార్ రాక్షస పాలన నుండి ప్రజలను విముక్తి చేయడం కోసం నాడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు.  దొరలు, భూస్వాములు, జమీందారులు జాగిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో పల్లె పల్లెల ఎర్రజెండాలు పట్టి సాయుధ  పోరాటంలో పాల్గొనరని ఈ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారని  పేర్కొన్నారు..సాయుధ పోరాటంకి సంబంధంలేని బిజెపి నేడు పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాన్ని అణచివేయడంతో పాటు నిజం సర్కార్ కు రక్షణ కల్పించడం కోసమే నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వచ్చాడు తప్ప తెలంగాణ ప్రజల విముక్తి కోసం కాదని పేర్కొన్నారు. నేడు దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి నాయకులు నాటి సాయుధ పోరాటని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సాయుధ పోరాటం నడిపింది , పోరాట వారసులు కమ్యూనిస్టులని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నమని తెలిపారు ఈనెల 11వ తేదీన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామాల్లో ప్రారంభమైన వారోత్సవాలు 15న మిర్యాలగూడ,దేవరకొండ నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నామని అదేవిధంగా *16వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనo లో ముగింపు సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసిం ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలియజేశారు ముగింపు సభకు సాయుధ పోరాట అమరవీరుల కుటుబసభ్యులు, ప్రజలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జని యాదగిరిరావు పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్ ,పబ్బు వీరస్వామి బోల్గురి నర్సింహ, గురిజ రామచంద్రం టి వెంకటేశ్వర్లు,బంటు వెంకటేశ్వర్లు చారి ,గిరి రామ తదితరులు పాల్గొన్నారు
Attachments area