సారా బట్టిలపై పోలీసుల దాడి

నల్గొండ, సెప్టంబర్ 13: జిల్లాలో సారా బట్టిలపై పోలీసులు దాడులు చేశారు. ఆదివారం జిల్లాలో పెద్దవూర మండలం బాసోనిబాయి తండాలో సారా భట్టీలపై పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో 5వేల లీటర్ల బెల్లం పానకం, 200 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.