సార్వత్రిక డిగ్రీ పరీక్షలు ప్రారంభం
ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు స్వ్కాడ్. పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఖమ్మం ఎన్‌అర్‌అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలతోపాటు జిల్లాలోని భద్రాచలం,మధిర,పాల్వంచ,ఇల్లెందు,సత్తుపల్లి, చర్ల,ఏన్కూరు,గార్ల చింతూరులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.