సింగరేణి కాంటాక్ట్ కార్మికులందరికీ ఏరియర్స్ చెల్లించాలి. – ఐఎఫ్టీయూ ధర్నా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి)
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఏరియర్స్, సీఎంపిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం సింగరేణి సబ్ ఓర్సియర్ (సూపర్ వైజర్)కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఐఎఫ్టీయూ (ఎస్సీసీడబ్ల్యూయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత సంవత్సరము నాలుగో నెల నుంచి కాంట్రాక్టు కార్మికులకు రావలసిన ఏరియర్స్ ఇంతవరకు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన జీవో ప్రకారంగా ఏరియర్స్ రావాల్సి ఉన్నదని. గత నెలలో 18 రోజులపాటు సమ్మె చేసి వేతనాలు లేక కాంట్రాక్టు కార్మికులంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ స్థితిలో ఇవ్వాల్సిన ఏరియర్స్ ను ఇవ్వకుండా మరింతగా ఇబ్బందులు గురి చేసే చర్యలకు యాజమాన్యం పాల్పడుతున్నదని ఆరోపించారు. గత మూడు సంవత్సరాలుగా సీఎంపీఎఫ్ లెక్కలతో కూడిన స్లిప్పులు ఇవ్వకపోవడం మూలంగా కాంట్రాక్ట్ కార్మికుల్లో ఆందోళన నెలకొని ఉన్నదని. తక్షణం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అందరికి రావలసిన ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని, సీఎం పీఎఫ్ స్లిప్పులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు ఎన్ కృష్ణవేణి, పద్మ, శ్యామ్ , వెంకటి, అబ్దుల్లా, రాములు, సునీత, గణేష్ , కొమరయ్య, రవి, శ్రీను, వేణు, లింగన్న, సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.