సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శన.
గాంధీ విగ్రహం ముందు కళ్లు, నోరు, చెవులు మూసుకుని నిరసన.
ఫోటో: నిరసన ప్రదర్శన చేస్తున్న కార్మికులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్22,(జనంసాక్షి)
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత పద్నాలుగు రోజులుగా తమ వేతనాలు 30% సింగరేణి యాజమాన్యం అంగీకరించిన విధంగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం సివిక్ కార్యాలయం నుంచి పాత జీఎం కార్యాలయం చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు కళ్ళు, చెవులు, నోరు మూసుకొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాంద్ పాషా మాట్లాడుతూ ఈ రోజు 22న ఆర్ ఎల్ సి హైదరాబాద్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చలు జరగనున్నాయని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు కూడా ఒక పట్టు పట్టి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఒత్తిడి తేవాలన్నారు. సింగరేణి యాజమాన్యం చర్చల్లో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు ఎల్తూరి శంకర్, హెచ్ఎంఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండ్ర శంకరయ్య, బిఎల్పీ జిల్లా కార్యదర్శి కన్నూరి సమ్మయ్య, ఐఎఫ్టీయూ డివిజన్, రీజియన్ నాయకులు, కృష్ణవేణి, పోసక్క, బొర్లకుంట రాములు, శ్యామ్, అబ్దుల్లా, రవి, కొమరన్న, శ్రీను, వెంకటి, గణేష్, లచ్చన్న, రాములు, సునీత, బుచ్చమ్మ, పద్మ, శకుంతల, బుచ్చన్న, రాజు, చంద్ర శేకర్ ,రవికుమార్ ,సదానందం, వినయ్, తదితరులు పాల్గొన్నారు.