సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ చెల్లించండి
1972 గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం దేశంలో ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పెరిగిన 20 లక్షల రూపాయల గ్రాట్యుటిని వర్తింపచేయాలి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 28-03-2018 పెరిగిన గ్రాట్యుటిని చెల్లిస్తున్నారు కానీ అదే రిటైర్డ్ సింగరేణి అధికారులకు 01-01-2017 నుండి అమలు చేస్తున్నారు. ఒక కుటుంబం ఒక దృష్టి ఒక లక్ష్యం సింగరేణి లో ప్రధానమైన అమలుచేయని నినాదం. గ్రాట్యుటీ చెల్లింపులో ఈ భేదం ఎందుకు చూపిస్తున్నరో తెలియడం లేదు. సింగరేణి నిధులను రాష్ట్ర సర్వతోభివృధికి ఇతోధికంగా ఇస్తున్నారు. కానీ సంస్థలో అహర్నిశలు కష్టపడి పని చేసి జీవితాన్ని ధారపోసిన ఉద్యోగులకు చట్ట ప్రకారం న్యాయంగా పెరిగిన గ్రాట్యుటిని చెల్లించక పోవడం వలన 01-01-2017 నుండి 28-02-2018 రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. అసలే చాలీచాలని పెన్షన్, కంటితుడుపు వైద్య సౌకర్యాలు తోడుగా గ్రాట్యుటీ చెల్లింపులో భేదంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన చెందుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల కష్టనష్టాలను దృష్టి లో ఉంచుకొని వెంటనే పెరిగిన గ్రాట్యుటిని చెల్లించాలని సింగరేణి చైర్మన్ కు వినతి పత్రం పంపడం జరిగినది. మానవత దృష్ట్యా విన్నపాన్ని పరిశీలించాలని వేడుకొనుచున్నాము.
దండంరాజు రాంచందర్ రావు
అధ్యక్షుడు
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాప్ర హైదరాబాద్
9849592958