సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులుపూర్తి చేయాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 31 (: సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులు మార్చి 2013నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఇరిగేషన్‌ అధికారులతో నిర్వహించిన సమావేశములో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సింగూర్‌ ప్రాజెక్టు నుండి లెఫ్ట్‌ మెన్‌ కెనాల్‌ 24.15కి.మీ., మెన్‌ బ్రాంచి కెనాల్‌ 24.10కి.మీ, రైట్‌మెన్‌ కెనాల్‌ 12.5కి.మీ. మేర నిర్మించాల్సి ఉండగా లెఫ్ట్‌మెన్‌ కెనాల్‌లో 0.75కి.మీ., మెన్‌బ్రాంచి కెనాల్‌లో 1.4కి.మీ., రెట్‌ మెన్‌కెనాల్‌లో 1.3 కి.మీ మేర ఇంకా పనులు చేపట్టాల్సి ఉందని, ఈ పనులన్నింటిని మార్చి 2013లోగా పూర్తిచేసి రైతులకు నీరు అందించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఈకాల్వల నిర్మాణపు పనులు నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేసి రైతులకు నీరందించాలని ఆయన అధికారులకు సూచించారు. లెఫ్ట్‌ మెన్‌కెనాల్‌పై 36స్టక్చర్స్‌ నిర్మాణాలు నిర్మించాల్సి ఉండగా అందులో 17 స్టిక్చర్స్‌ పనులు పూర్తి వివిధ దశలలో ఉన్నాయని, 2స్టక్చర్స్‌ పనులు ప్రారంభించలేదని తెలిపారు. మెన్‌ బ్రాంచి కెనాల్‌పై 64 స్టక్చర్స్‌ నిర్మించాల్సి ఉండగా, 12 పనులు పూర్తి అయినవి, 6 పనులు వివిధ దశలలో ఉన్నాయని, 46పనులు చేపట్టబడలేదని ఆయన తెలిపారు. రెట్‌మెన్‌కెనాల్‌పై 26స్టక్చర్స్‌ నిర్మించాల్సి ఉండగా, 4 పనులు ప్రగతి దశలో ఉన్నాయని, 22 పనులు చేపట్టలేదని, ఈ పనులన్నింటికి కూడా మార్చి 2013లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ ఈఈ బాల్‌రాజ్‌, డిప్యూటీ ఈఈ జగన్నాథం, జెఈలు మహాలక్ష్మి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ఎ.ఎం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.