సింగూర్‌కు వరద ఉధృతి
గతంతో పోలిస్తే పెరిగిన నీటిమట్టం
మెదక్,జూలై18(జనం సాక్షి): సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగడంతో జలకళ సంతరించుకుంది. డ్యామ్‌కు ఎగువనుంచి ప్రతిరోజూ వరద ప్రవాహం వస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటంతో డ్యామ్‌లోకి వరద ప్రవాహం ఉదృతం అవుతున్నది. గత ఏడాది ఇదే రోజు 520.540 విూటర్లకు 17.050 టీఎంసీల నీరుండేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 1.5టీఎంసీల నీరు చేరింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మంజీరా నదిపై సింగూర్ ప్రాజెక్టును నిర్మించారు. సింగూర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో 250కిలోవిూటర్ల క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్నది. ఈ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు నీరంతా మంజీరా నది గుండా సింగూర్‌లోకి చేరుకుంటున్నది. సింగూర్ ప్రాజెక్టులో 1980నుంచి 200వరకు ప్రారంభంలోనే వరదలు వచ్చేవి. కానీ మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సింగూర్ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలోనే కాకుండా మంజీరా నది పరివాహకంలో ఈ రెండు రాష్ట్రాలు పలు బ్యారేజీలు, బ్రిడ్జి కం డ్యాంలు, లిప్టులు నిర్మించటంతో మంజీరా ప్రవాహం వానకాలం ప్రారంభంలో రావడం లేదు. పైన నిర్మించిన డ్యామ్‌లు, చెక్‌డ్యామ్‌లో, బ్యారేజీలు నిండినతర్వాత మిగిలిన నీటిని అక్కడి ప్రాజెక్టు అధికారులు దిగువకు
వదులుతారు. వానకాలం ప్రారంభంలో పై రెండు రాష్ట్రాల్లో పునాసా పంటలు విత్తిన తర్వాత అవి పూర్తి కావటానికి సరిపోను నీటిని రిజర్వాయర్లలో నిల్వుంచి తర్వాత వచ్చే వరదలను దిగువకు వదులుతారు. ఇదంతా పూర్తికావడానికి రెండు నెలల సమయం పడుతున్నది. దీంతో సింగూర్ ప్రాజెక్టుకు భారీ వరదలు రావడానికి అక్టోబర్, సెప్టెంబర్ వరకూ వేచి చూడాల్సివస్తున్నది. వానకాలం ముగింపు సమయంలో డ్యామ్ నిండుతున్నది.గత దశాబ్దంన్నర నుంచి ప్రాజెక్టులో వరదలు వానకాలం ప్రారంభం కాకుండా సెప్టెంబర్ నెలలో వరద ప్రవాహం వస్తున్నది. ప్రారంభంలో సింగూర్ క్యాచ్‌మెంట్ ఏరియా నుంచే వరదలు రావడం వల్ల రోజు వందల క్యూసెక్కులు మాత్రమే వస్తున్నది. దీంతో వానకాలం ప్రారంభంలో రెండు, మూడు టీఎంసీలకు మించి డ్యామ్‌లోకి వరదలు రావడంలేదు. దీంతో డ్యామ్‌లో పూర్తి నీటి సామర్థ్యం రావడానకి సెప్టెంబర్ నెల వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ బాలగణెళిశ్ తెలిపారు.