సింగూర్ ప్రజెక్టులో పెరిగిన నీటిమట్టం
పుల్కల్: గత మూడురోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రజెక్టులో 3, 314క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ డీఈఈ జగన్నాధరావు తెలిపారు. దీంతో ఈరోజు ప్రాజెక్టు నీటిమట్టం 518.270 అడుగులు ఉండగా 10.04టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందని తెలిపారు. దీంతో 305క్యూసెక్కులనీటిని బయటకు వదిలామని తెలిపారు.