సింగ్రౌలీ మున్సిపల్ మేయర్‌గా ఆప్ అభ్యర్థి
రాణి అగర్వాల్ అనూహ్య విజయం
భోపాల్,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడిరచారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నెగ్గడం ఇదే తొలిసారి.
2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్.. తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజీవ్రాల్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు. సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆ పార్టీ కన్వినర్ అరవిందక్ కేజీవ్రాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు.