సింహగర్జనను విజయంచేసినందుకు కృతజ్ఞతలు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్యవైశ్య సింహగర్జనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్యభవనంలో సంఘం ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో కూడా ఆర్యవైశ్యులు ముందుండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘం అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్, అధ్యక్షుడు ప్రకాశం, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, ఎన్నికల అధికారులు జయకుమార్… తదితరులు పాల్గొన్నారు.