*సింహగర్జనలా బండి యాత్ర*
శశాంక్ సింగ్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు స్టాండ్లు చేతి కర్రల పంపిణీ
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 20:- మానవత్వాన్ని మరిచి స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు రాజకీయంగా రానించిన దాఖలాలు లేవని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షులు శశాంక్ సింగ్ అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కుటుంబ సభ్యులతో రాచరిక పాలన కొనసాగిస్తున్న దొరల గడీలను బద్దలు కొట్టి విసిగి వేషాలిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకోసం అకుంఠిత దీక్షాఘ్రష్టుడై తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టి నాలుగవ విడతలో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకోసం వస్తున్న నేపథ్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షులు శశాంక్ సింగ్ మానవత దృక్పథంతో వృద్ధులకు వికలాంగులకు నడిచేందుకు వీలుగా ఉండే స్టాండ్లు చేతి కర్రలు మరియు సపాయి కార్మికులకు నిత్యవసర సరుకులను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు వృద్ధులు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు
Attachments area