సిఆర్డీఎ ముందు ప్రజాసంఘాల నిరసన

సింగపూర్‌ ఒప్పందాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌

విజయవాడ,జూన్‌7(జ‌నం సాక్షి): ఏపీ ప్రభుత్వాం సింగపూర్‌ మధ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగపూర్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ ఒప్పందాలతో ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువని, రహస్య ఒప్పందాలను చంద్రబాబు బయటపెట్టాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే భూములు తీసుకున్న రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని, వారికి పరిహారం చెల్లించలేదన్నారు. అలాగే వారికి ప్లా/ాటలు కూడా కేటాయించలేదన్నారు. ఇదిలావుంటే అమరావతి రాజధాని నుండి అనంతరపురం వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే రహదారిని వేసేందుకు గతంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యచర్యణ జారి చేసింది. ఆసమయంలో తమ పొలాల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవే వేసేందుకు రైతులవద్ద నుండి వ్యతిరేకత ఏర్పడింది. తమ విలువైన పొలాలను పోగోట్టుకోవడంపై ఎక్కువ శాతం మంది రైతులు అసహనాన్ని తెలిపారు. అయితే మేడికొండూరు శివారు ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే మ్యాప్‌ ద్వారా హద్దురాళ్ళు వేసేందుకు, సదరు కాంట్రాక్టర్‌, రెవెన్యూ అధికారులు సన్నద్ధమయ్యారు. విషయం తెసులుసుకున్న పలువురు రైతులు జిల్లా కౌలురైతు సంఘం ఉపాధ్యక్షులు బొట్ల రామకృష్ణ అక్కడకు చేరుకొని హద్దురాళ్ళు వేసే అధికారులును అడ్డుకున్నారు. పొలలకు చెందిన రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాళ్లు వేయటంఎంటని రెవెన్యు అధికారులను ప్రశ్నించారు. వారిని అడ్డుకోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల ద్వారా రైతులు తమ పంటపొలాలు పోగొట్టుకుని నష్టపోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హద్దురాళ్ళు వేయంటం ఏంటని ప్రశ్నించారు. ఆయా పంటపొలాల రైతులు పలురకాలుగా తమ ఆందోళనను తెలియపరిచారు.