సిఎం కెసిఆర్ వినూత్న ఆలోచనే రైతుబంధు పథకం
రైతులకు సాయం చేసినా తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్
ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపాటు
సంగారెడ్డి,మే11(జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. రైతుబంధు పథకం ఇందులో భాగమని అన్నారు. దేశంలో ఎవరు కూడా అలోచన చేయని విధంగా రైతులకు పెట్టిబడి సాయం ప్రభుత్వమే అందించాలని నిర్ణయించడం అద్భుతం అన్నారు. ఈ విసయాన్‌ఇన దేశం యావాత్తూ అంగీకరించిందని అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అం/-దుకే పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. రైతులు బాగుఏపడడం వారికి ఇస్టం లేనట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ, పంట పెట్టుబడి వద్దంటున్న కాంగ్రెస్ నేతలను ఏం చేయాలో ప్రజలే ఆలోచించాలని హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. పాసుపుస్తకాలకు, చెక్కుల కోసం ఎవరికీ లంచం ఇవ్వొద్దని రైతులకు మంత్రి సూచించారు. ఇవన్నీ ప్రభుత్వమే నేరుగా ఇస్తోందని అన్నారు. ఎవరైనా అలా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరాకు రెండు కిస్తుల్లో రూ.8 వేలను పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులు ఈ డబ్బులను వృథా చేయకుండా విత్తనాలు, ఎరువుల కొనుగోలు, పంటల సాగు కోసం ఉపయోగించు కోవాలని కోరారు. రైతుబంధు పథకం రైతులకు ఎంతగానే ఉపయోగపడుతుందని తెలిపారు. ఏటా రైతులు వానలు పడగానే విత్తనాలు, ఎరువుల కోసం దళారుల వద్దకు పోతారని, వారు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తారని ఇప్పుడు రైతులకు అప్పులు బాధలు తప్పాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరాకు రెండు కిస్తీల్లో రూ.8 వేలను పంపిణీ చేస్తోందని తెలిపారు.
—