సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
నెరడిగొండసెప్టెంబర్18(జనంసాక్ షి):
గిరిజనులకు10శాతం రిజర్వేషన్లు కల్పించి కైతి లబనా మధుర సమాజాన్ని ఎస్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినందుకు వారి చిత్రపటానికి ఆదివారం రోజున మండలంలోని కొరిటికల్ బి గ్రామంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.శనివారం జరిగిన సభలో సీఎం ఎస్టీలకు10 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం దానిలో మా లభనా మథుర సమాజాన్ని కూడా ఎస్టీల్లో చేర్చడం జరుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని గుర్తు చేస్తు సమస్త గ్రామ ప్రజలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొరటికల్ బి గ్రామపంచాయతీ సర్పంచ్ బర్ధవల్ శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి సాబ్లె కేవల్ సింగ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ సింగ్ సమస్త గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area