సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన హరీష్ రావు
మెదక్,ఆగస్ట్13(జనం సాక్షి ): మల్కాపూర్ గ్రామానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడ సిఎం పర్యటన ఏర్పట్లను పరిశీలించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి గ్రామానికి వచ్చారు. సభస్థలి, హెలిప్యాడ్ ఏర్పాటు పనులతో పాటు గ్రామంలో జరుగుతున్న హారితహారం మొక్కలు నాటే కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఉదయం మల్కాపూర్‌లో జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మొక్క నాటే రాక్ గార్డెన్‌తో పాటు గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడే అవకాశాలున్నాయి. అలాగే 15న ఇక్కడ సిఎం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.