సిఎల్‌ టీ ట్వంటీ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ, కోల్‌కత్తా ఢీ

ఓకే గ్రూప్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌
ముంబై, జూలై 27 : వచ్చే అక్టోబర్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ లీగ్‌ ట్వంటీ ట్వంటీ టోర్నీ గ్రూపులను ప్రకటించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులను విభజించారు. గ్రూప్‌ ఎలో ఐపీఎల్‌ టీమ్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, దక్షిణాఫ్రికాకు చెందిన టైటాన్స్‌, ఆస్ట్రేలియా డొమెస్టిక్‌ టీ ట్వంటీ టీమ్‌ పెర్త్‌ స్కార్చర్చ్‌ చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు క్వాలీఫైయింగ్‌ పూల్‌ 1 నుంచి మరో జట్టుకు చోటు దక్కుతుంది. గ్రూప్‌ బిలో ఐపీఎల్‌ టీమ్స్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, దక్షిణాఫ్రికా నుంచి హైవీల్డ్‌ లయన్స్‌, ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ సిక్సర్స్‌తోపాటు మరో క్వాలీఫైయింగ్‌ జట్టు వచ్చిచేరుతుంది. అటు ప్రదాన టోర్నీ కంటే ముందు జరగనున్న క్వాలిఫైయింగ్‌ టోర్నీలో జట్లను కూడా రెండు ఫూల్స్‌గా డివైడ్‌ చేశారు. పూల్‌ 1లో పాకిస్తాన్‌కు చెందిన సెయిల్‌కోట్‌ స్టాలిన్స్‌, న్యూజిలాండ్‌కు ఆక్లాండ్‌ ఏసెస్‌, ఇంగ్లాండ్‌ డొమెస్టిక్‌ లీగ్‌ ఫ్రెండ్స్‌ లైఫ్స్‌ టీ ట్వంటీ రన్నరఫ్‌తోపాటు శ్రీలంక డొమెస్టిక్‌ టీ ట్వంటీ విన్నర్‌ ఉన్నాయి. క్వాలీఫైయింగ్‌ టోర్నీ అక్టోబర్‌ 9 నుండి ప్రారంభంకానుంది. అటు ప్రదాన లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టీ ట్వంటీ ఛాంపియన్స్‌ టైటాన్స్‌, స్కార్చర్స్‌తో తలపడనుండగా మరో మ్యాచ్‌లో ఐపీఎల్‌ టీమ్స్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ ఢీ కొంటాయి. నిజానికి వచ్చే అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ వివిధ కారణాలతో సౌతాఫ్రికాకు మార్చారు. సీఎల్‌ టీ ట్వంటీ సఫారీ గడ్డపై నిర్వహించడం ఇది రెండోసారి. 2010లో కూడా దక్షిణాఫ్రికానే వేదికగా నిలిచింది. కేప్‌టౌన్‌, జోహెనస్‌బర్గ్‌, సెంచూరియన్‌, డర్బన్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. బీసీసీఐ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డులు కలిసి నిర్వహిస్తోన్న ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నీలో విదేశీ డొమెస్టిక్‌ జట్లు కూడా పాల్గొంటున్నాయి. ప్రతిదేశం నుండి దేశవాళీ టీ ట్వంటీలో విజేతగా నిలిచిన జట్టుకు ఆడుతుంది. తాజాగా ఈ ఏడాది నాలుగు ఐపీఎల్‌ జట్లు ఆడనున్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్‌ నుండి పాల్గొనే జట్లు ఇంకా ఖరారు కాలేదు. శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌, ఫ్రెండ్స్‌ లైఫ్‌ టీ ట్వంటీ టోర్నీల తర్వాత ఈ జట్ల వివరాలు తెలుస్తాయి. ఇక తొలిసారిగా పాకిస్థాన్‌ నుంచి కూడా డొమెస్టిక్‌ టీ ట్వంటీ టీమ్‌ ఈ సీజన్‌లో ఆడనుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు ఇటీవలే పునరుద్ధరణ జరిగినప్పటికీ అంతకుముందే బీసీసీఐ వారికి ఆహ్వానం పంపింది. దీంతో పాక్‌కకు చెందిన సెయిల్‌కోట్‌ స్టాలిన్స్‌ సిఎల్‌ టీ ట్వంటీలో ఆడనుంది.
గ్రూప్‌ ఎ : కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, టైటాన్స్‌, పెర్త్‌ స్కార్కర్స్‌, క్వాలిఫైయర్‌
గ్రూప్‌ బి : చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, హైవీల్డ్‌ లయన్స్‌, సిడ్నీ సిక్సర్స్‌,
క్వాలిఫైయింగ్‌ పూల్‌ 1 : సెయిల్‌కోట్‌ స్టాలిన్స్‌, ఆక్లాండ్‌ ఏసెస్‌, ఫ్రెండ్స్‌ లైఫ్‌ టీ ట్వంటీ విజేత
క్వాలిఫైయింగ్‌ పూల్‌ 2 : ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, ఫ్రెండ్స్‌ లైఫ్‌ టీ ట్వంటీ రన్నరప్‌ – శ్రీలంక.