సిఐటియు ఆటో యూనియన్ టిఆర్ఎస్ లో చేరలేదు ఇలాంటి తప్పుడు ప్రకటనలు మానుకోవాలి
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
మేళ్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన ఆజాద్ ఆటో యూనియన్. భగత్ సింగ్ ఆటో యూనియన్ సమావేశం ఎస్.కె నయన్ బాబా. ఎస్.కె జబ్బార్. అధ్యక్షన గ్వ్జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు. సిఐటియు జిల్లా నాయకులు శీలం శీను. మాట్లాడుతూ మేళ్లచెరువు మండలంలో సిఐటియు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని వారన్నారు. ఆటో యూనియన్ కార్మికులు టిఆర్ఎస్ లో 30 మంది చేరారని తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని వారన్నారు. ఆజాద్ ఆటో యూనియన్. భగత్ సింగ్ ఆటో యూనియన్. 70 మంది సిఐటియు లో ఉన్నామని కార్మికులు తెలిపినారు. ఇలాంటి చౌక వారి ప్రకటనలు మానుకోవాలని వారు హెచ్చరించారు.20 సంవత్సరాల నుండి మేళ్లచెరువు హుజూర్నగర్ అడ్డ ఏర్పాటు చేసుకొని నిత్యం ఆటో యూనియన్ కార్మికుల కోసం పనిచేస్తున్న సిఐటియుని బదనం చేయాలనికొంతమంది వ్యక్తులు కంకణం కట్టుకొని చెడు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. రాష్ట్ర . దేశంలో సిఐటియు కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించిన చరిత్ర సిఐటియు కు ఉన్నదని వారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే ప్రజలు కార్మికులు తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆటో కార్మికులు. కే మల్లయ్య. జై వెంకటేశ్వర్లు. నాగులు మీరా. ధర్మ తేజ. వెంకట్ రెడ్డి. లింగయ్య. గోపి. శ్రీనివాసరావు. మహమ్మద్ హుస్సేన్. నరసింహారావు. శంబయ్య. రాకేష్. గణేష్. రవి. ఉపేందర్ రెడ్డి. నాగేశ్వరరావు. రాంబాబు. నాగరాజు. రాము. పి గురవయ్య. సలీం రాజేష్. గాలిషా. ఇస్మాయిల్. దుర్గయ్య. ఆదినారాయణ. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.