సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి: జిల్లా కోశాధికారి జి. భాస్కర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి.
కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్ధిపేట పట్టణంలో 2022 డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని దౌల్తాబాద్ లో గ్రామ పంచాయితి కార్మికులతో కలిసి కరపత్రం విడుదల చేస్తున్న CITU జిల్లా కోశాధికారి జి. భాస్కర్, అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ మహాసభలు నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు, శ్రేయోభిలాషులు, కార్మికులు, ఉద్యోగులు, తమ ఆర్ధిక, హర్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు,మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కార్మిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రోజుకు రూ॥ 178/- ఉండాలని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వ ప్రకటించడం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని,విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలో కనీస వేతనాల పెంపుదల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.గ్రామ పంచాయతీ, కార్మికుల సమస్యలతొ పాటు తదితర రంగాల కార్మికుల్లో వస్తున్న సమస్యలపై సిఐటియు పోరాడుతుందనీ,ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. కావునా ప్రజలు, శ్రేయోభిలాషులు, కార్మికవర్గం,ఉద్యోగ వర్గాలు ఉదారంగా ఆర్ధిక, హర్థిక సహయ సహకారాలు అందించాలని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు భాల్ రాజు, రాములు, నాగరాజు, వెంకటేశం, కృష్ణ, దాదేఖాన్, అంజయ్య, మల్లేశం, బాలమల్లు, మహేష్, స్వామి, అనిల్, లక్ష్మి, బాలమని, నర్సవ్వ, లలిత, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.