సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ గా ఏ. ఎస్. భాస్కర్ గిరి..
సికింద్రాబాద్ (జనం సాక్షి ) సీతాఫలమండి డివిజన్ నామాల గుండు చెందిన అడ్వకేట్ ఏ ఎస్ భాస్కర్ గిరి కి మహంకాళి జిల్లా సికింద్రాబాద్ బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించిన సికింద్రాబాద్ మహాకాళి జిల్లా బిజెపి అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ నియామక పత్రాన్ని భాస్కర్ గిరి కి అందజేశారు . మహంకాళి జిల్లా సికింద్రాబాద్ బిజెపి ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి భాస్కర్ గిరిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు . భాస్కర్ గిరి మాట్లాడుతూ పార్టీ కొరకు కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తించి తగ్గిన బాధ్యతలు అప్పగిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన వారి నమ్మకాన్ని నిలబెడుతూ , నా సహాయ శక్తుల నిరంతరం పార్టీ కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు . పార్టీలో సీనియర్ నాయకులకు , కార్యకర్తల కు ప్రత్యేక ధన్యవాదాలు.