సికింద్రాబాద్ లో జరిగిన మారణహోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
పిడిఎస్యు జిల్లా నాయకులు భానోత్ దేవేందర్*
బయ్యారం, జూన్ 18(జనంసాక్షి):
రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, పోలీస్ కాల్పుల్లో చనిపోయిన నిరుద్యోగికి తక్షణమే కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు మాట్లాడుతూ…
భారత రక్షణ రంగంలో అగ్నిపథ్ పథకం ప్రవేశ పెట్టడం భారత దేశానికి అతి పెద్ద విఘాతం అని, రక్షణ రంగంలో ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులను కించపరిచే విధంగా ఉందని, వారి త్యాగాలను అపహాస్యం చేసే విధంగా, వారి ఇ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసేదిగా ఈ పథకం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్న నిరుద్యోగుల పై కాల్పులు జరపటం అన్యాయమని, దీనిని పిడిఎస్యు విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామని, చనిపోయిన నిరుద్యోగ కుటుంబానికి కోటి రూపాయలు, పోలీస్ కాల్పుల్లో క్షతగాత్రులు అయిన వారికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోదర్, నవీన్, పవన్, ప్రకాష్, జైపాల్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.