సిక్కుల ఊచోకోత అసహనం కాదా?

3

– మోదీ ఎదురుదాడి

పాట్నా, నవంబర్‌2(జనంసాక్షి):దేశంలో అసహనం పెరిగిపోతుందని విమర్శలపై ప్రధాని నరేంద్రమోడి ఎదురు దాడి చేశారు.1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం  సిక్కుల ఊచకోత అసహనం కాదాఅని ఆయన ప్రశ్నించారు. బిహార్‌లో ఆటవిక పాలన సాగుతోందని మోదీ ఆరోపించారు. ఇక్కడ అభివృద్దికి బీజం వేయాలన్నదే తన సంకల్పమని అన్నారు. బీహార్‌ అభివృద్దికి ఓటేయాలని అన్నారు. తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిహార్‌లో ఆటవిక పాలనపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. లాలూ 16 ఏళ్లు, నితీష్‌కుమార్‌ పదేళ్లు బిహార్‌ను పాలించినా బిహార్‌లో మార్పులేవిూ తీసుకు రాలేకపోయారన్నారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులపై ఉందన్నారు. తాను బిహార్‌కు వస్తుంటే లౌకిక కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారని… తాను బిహార్‌కు రాకూడదా? అని ప్రశ్నించారు. ఈనెల 8న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో భాజపాకు ఆధిక్య తథ్యమని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్‌ ప్రజలకు ఆ రోజు రెండు దీపావళిలు రానున్నాయని అన్నారు. ఒకటి ఫళితాలు కాగా రెండోది దీపావళి అన్నారు. గత పాలకులు లాలూ 15 సంవత్సరాలు, నితీష్‌ 10 సంవత్సరాలు పాలించారనీ, వీరి జంగిల్‌ రాజ్‌ పాలనతో ప్రజలకు ఒరిగిందేవిూ లేదని విమర్శంచారు. త పాలకులు తమ అసమర్ధతపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని మోదీ అన్నారు. తాను బిహార్‌కు రావడాన్ని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో తెలియడం లేదన్న మోదీ.. ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని సూచించారు.