సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు: దానం నాగేందర్
హైదరాబాద్, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పోలీస్ అధికారినైన దూషించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తేల్చిచేప్పారు. వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా సీఎం కోరానని తెలిపారు. తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. సీబీఐ ఛార్జీషీటులో ఏముందో తెలియకుండా సబిత విషయంలో స్పందించను అని దానం అన్నారు.