సిద్దయ్య ఆరోగ్యం విషమంగానే ఉంది

కామినేని వైద్యులు

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్దయ్య ఆరోగ్య పరిస్థిపై వైద్యులు బులిటెన్‌ విడుదల చేశారు. సిద్దయ్య ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సిద్దయ్య శరీరం చికిత్సకు సహకరించడం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.