సిద్దిపేటలో రక్తదాన శిబిరం

సిద్దిపేట: పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా సిద్దిపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు.రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ శివకుమార్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్ధి సంఘాల నేతలు పాల్గొన్నారు. వారం రోజుల పాటు సాగే వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తమని పోలీస్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. ఇందులో అందరిని భాగస్వామ్యం చేస్తమన్నారు.