సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లాలో శనివారం సాయంత్రం
చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్‌ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందారు. 20మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం అలుముకుంది. గాయపడినవారు పెద్దసంఖ్యలో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.