సిద్దిపేట జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 29)
సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల  29 శనివారం నాడు సిద్దిపేట  జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ జట్టు కు క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మంద జనార్ధన్, కార్యదర్శి గన్నే రాజిరెడ్డిలు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే బాల బాలికలు సిద్దిపేట  ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో  ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారులు 16 సంవత్సరాల లోపు వయస్సు గలవారు.  (01.01.2003 తర్వాత పుట్టిన వారూ ఉండాలి) బాలికలు 55 కిలోల లోపు బరువు గల వారు అర్హులని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తారని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 12నాడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగే 31 జిల్లాల రాష్ట్రస్థాయి పోటీలలో సిద్దిపేట జిల్లా తరుపున పాల్గొంటారని తెలిపారు.ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డ్, పదవతరగతి  మెమో, బోన ఫైడ్ సర్టిఫికెట్లను వెంట తీసుకు రావాలని సూచించారు. సమాచారం కోసం కృష్ణ 9000342551, భరత్ రెడ్డి 9246666472 ఫొన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.