సిద్దిపేట డీఎస్పీ బదిలీ
సిద్దిపేట మున్సిపాలిటీ (జనంసాక్షి):- సిద్దిపేట డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ మదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ క్షనివాసరావు వస్తున్నారు. శ్రీధర్ గ్రేహౌండ్స్‌లో మూడు నెలల శిక్షణ నిమిత్తం వెళ్తున్నారను. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లోనే ఉన్న శ్రీనివాస్‌రావుకు ఇక్కడ పోస్టింగ్ లభించింది. ఈయన రెండు నెలల కిందటి వరకు తూఫ్రాన్ డీఎస్పీగా పనిచేశారు. మే తోలి వారంలోగా ప్రస్తుత డీఎస్పీ రిలీఫ్ ఆవడం, కొత్త డీఎస్పీ విధుల్లో చేరడం జరుగనుందని తెలుస్తోంది. నిజానికి సిద్దిపేటలో ఒకరిద్దరు సీఐలుగా బదిలీ అయ్యే అవకాశముందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ అందుకు డీఎస్పీకి స్థాన చలనం కలుగడం అనూహ్యమైనదిగా భావిస్తున్నారు. అయితే డీఎస్పీలకు గ్రేహౌండ్స్‌లో శిక్షణ తప్పనిసరైనందునే శ్రీధర్ ను బదిలీ చేశారని పోలీసు వర్గాలు పేర్కోంటున్నాయి. శిక్షణ పూర్తయ్యాక ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చేది తెలుస్తుంది. రాష్ట్రంలో 25 మంది సబ్ డివిజన్ పోలీసు అధికారుల(డీఎస్పీ)ను బదిలీ చేసూఐ్త పోలీసు ఎస్టాబ్లిస్‌మెంట్ బీర్డు తీసుకున్న నిర్ణయం మేరకే ఈ బదిలీలు చేసినట్లు డీజీపీ వి.దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పాలిక మంది డీఎస్పీల జాబీతలో శ్రీధర్ కూడా ఉన్నారని మంగళవారం ఇక్కడ వెల్లడైంది.