సిద్దిపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షత గాత్రులను పరామార్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
10 మంది మృతి, మరో 5మంది పరిస్థితి విషమం, 30 మందికి గాయాలు
క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలింపు
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్‌ వెంకటరాంరెడ్డి

సిద్దిపేట బ్యూరో,  మే 26: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 5 గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ గాందీ ఆసుపత్రికి తరిలించారు. 30 మందికి గాయాలు కాగా వారిని గజ్వేల్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద రాగానే ప్రమాదశవత్తు రెండు లారీలు, బస్సు, సుమో వాహనాలు ఒక దానికి ఒకటి డీకోట్టడంతో సుమోలో, బస్సులో, లారీలో ఉన్న వారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఉన్న మరో 5 గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గాందీ ఆసుపత్రికి తరలించారు. గాయలు అయిన మరో 30 మంది గజ్వేల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నవ తెలంగాణ జర్నలిస్టు లక్ష్మణ్‌, ఆయన కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నారు. వారితో పాటు బస్సులో ప్రయణిస్తున్న నలుగురు, లారీ, సుమో  వాహనాల్లో ఉన్న మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సంఘటన తెలియగానే సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. క్షత్ర గాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. విషయం తెలియగానే మంత్రి హరీష్‌రావు  దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్‌ వెంకటరాంరెడ్డి కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి,  గజ్వేల్‌ ఆసుపత్రికి వెళ్లి క్షత్ర గాత్రులను పరామార్శించారు. ఇంత మంది మృతి బాధకరమని అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.  మరెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవద్దని, మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.