సిద్దిపేట సిగలో మరో మణిహారం తెలంగాణ ఎఫ్ఎం సేవలు
ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఎన్నో ప్రచారసాధనాలు మనకు అందుబాటు లో ఉన్నాయి కానీ మనకు ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేది మన చరవాణి అలాంటి చరవాణిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి సమాచారం తెలియజేయాలనే ఉద్దేశంతో మన సిద్దిపేట పట్టణంలో తెలంగాణ ఎఫ్ ఎం ఏప్రిల్ 14, 2019 సంవత్సరంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించబడింది.
ప్లే స్టోర్లో అందుబాటులోకి
మెట్రో పట్టణాలకే పరిమితమైన ఎఫ్ఎమ్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో కూడా ప్రారంభించడం వల్ల స్థానిక సిద్దిపేట పట్టణ వాసులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్లే స్టోర్ కి వెళ్లి తెలంగాణ ఎఫ్ఎం అనే ఆప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ప్రయాణం చేస్తున్న సమయంలో కానీ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న సమయంలో గాని అలాగే మహిళలు, వ్యాపారస్తులు పనిలో బిజీగా ఉన్నా మన సిద్దిపేట పట్టణంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని తెలంగాణ ఎఫ్ఎం ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్న వారికి ట్రాఫిక్ సంబంధించిన విషయాలు మహిళలకు ఆరోగ్య సంబంధమైన విషయాలు మరీ ముఖ్యమైనది అందం ఆరోగ్యం సంబంధిత మెలకువలు అలాగే కొనుగోలుదారులకు వ్యాపార సంస్థల సమాచారం, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ ఎఫ్ఎం వినవచ్చు అలాగే అందుబాటులో ఉండే ప్రతి మనిషికి ఎంతో ఉపయోగకరమైన ఫోన్లో మన తెలంగాణ ఎఫ్ఎం ఉండడం ఎంతో అభినందనీయం మెట్రో నగరంలో కేవలం చుట్టుప్రక్కల ఉండే ప్రదేశంలో అనగా కొన్ని కిలోమీటర్ల వరకు సిగ్నల్ ద్వారా వింటాము.సిగ్నల్స్ అందకపోతే ఎఫ్ఎం ఆగిపోతుంది. కానీ తెలంగాణ ఎఫ్ఎం లో అలా కాదు ఎప్పుడు, ఎక్కడ ఉన్న ఫోన్ లో తెలంగాణ ఎఫ్ఎం లో మనం వివిధ అంశాలకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారికి మన ఎఫ్ ఎం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కోరిన వారికి కేవలం ఫోన్ కాల్ చేస్తే చాలు వారికి కావలసిన పాటలను కూడా వినిపిస్తుంది ఉదయం ప్రభాత సమయంలో భక్తికి సంబంధించిన సమాచారాన్ని సాంప్రదాయాలకు చెందిన విషయాలను తెలియజేస్తూ భక్తి పాటలను ప్రసారం చేస్తూ మనస్సుకు ప్రశాంతత చేకూరుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి రాశి ఫలాలు కూడా ఏరోజుకారోజు ఫలితాలు ఎలా ఉంటాయో అని కూడా వివరంగా మన తెలంగాణ ఎఫ్ఎం విషయంలో తెలుసుకోవచ్చు.
ఆ పాత మధురిమలు:
పాటల పూదోట మన ఎఫ్ఎమ్ అలనాటి తారలు నటించిన సినిమాలలోని ఆ పాతమధురిమలు అనే కార్యక్రమం ద్వారా మధురమైన పాటలను కూడా తెలంగాణ ఎఫ్ఎం లో విని ఆస్వాదించవచ్చు. ఒంటరితనంలో ఓదార్పు ఎఫ్ఎం తుంటరి అల్లరికి సహచరుడు మన తెలంగాణ ఎఫ్ఎం కేవలం వినడానికి మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా ఎవరికైనా సమస్యలు ఎదురైనప్పుడు ఎప్పుడైనా అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన పరిస్థితి లో కూడా ఎఫ్ ఎం ద్వారా మనం సమాచారం తెలుసుకుని ప్రాణాలను కూడా నిలబెట్టుకునే సౌకర్యం అందిస్తుంది తెలంగాణ ఎఫ్ ఎం. ప్రతి ఒక్క సమస్యపై స్పందించి వెంటనే అతివేగంగా వార్తను చేరవేస్తుంది మన తెలంగాణ ఎఫ్ ఎం. వార్త దినపత్రికలు చదివితే కేవలం కొంత సమాచారం మాత్రమే మనకు చేరుతుంది కానీ మన తెలంగాణ ఎఫ్ఎం ద్వారా వెనువెంటనే వందలకొద్దీ సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. సిద్దిపేటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ఎఫ్ ఎం ద్వారా సిద్దిపేట వాస్తవ్యులు కు చేరవేస్తుంది అలాగే ఇతర జిల్లా, రాష్ట్రాల, దేశాల్లో ఉన్న వారు కూడా సిద్దిపేట పట్టణం యొక్క విశిష్టతను తెలుసుకోగలుగుతారు.
వ్యాపార సంబంధమైన ప్రకటనలు కూడా ఎఫ్ఎం ద్వారా అందించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కొనుగోలుదారులకు సేవలు అత్యంత చేరువవుతాయి. అలాగే విద్యార్థులకు కళాకారులకు సంగీత సాహిత్య కళా కారులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మన ఎఫ్ ఎం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయ తీరాలను చేరుకున్న వారి అభిప్రాయాలు సలహాలు, సూచనలు ఎఫ్ఎం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలియజేయటం వలన ప్రతి ఒక్క విద్యార్థి తమ జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలో తెలుసుకోగలుగుతారు. 2018 సంవత్సరంలో మిస్ తెలంగాణ గా ఎంపికయిన కామాక్షి భాస్కర్ల తెలంగాణ ఎఫ్ ఎమ్ ఆవిష్కరణలో పాల్గొని యువతీ, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు ఈ తెలంగాణ ఎఫ్ఎం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు తమ పనిలో తాము నిమగ్నమైన కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు అని తెలిపారు.
అందరికి చేరువలో ఎఫ్. ఎమ్
అనతికాలంలోనే ప్రజలందరికీ చేరువైన తెలంగాణ ఎఫ్ఎం ఇప్పుడు సిద్దిపేట పట్టణంలో ఉన్న యువతీ, యువకుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది అందుకుగాను తెలంగాణ ఎఫ్ఎం టాలెంట్ హంట్ అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉందని దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ఎఫ్ ఎం తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 11వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ ఎసిపి బాలాజీ, మినీ ట్యాంక్ బండ్ ఇన్చార్జ్ చారి చేతుల మీదుగా గా టాలెంట్ హంట్ బ్రోచర్ ని ఆవిష్కరించారు. నేటి సమాజంలో ఎంతోమంది యువతీ యువకులు ఎన్నో రకాలుగా ఆసక్తులు అభిరుచులు కలిగి ఉన్నా కూడా అవకాశాలు లేక వారి యొక్క టాలెంట్ మరుగున పడిపోతుంది కాబట్టి అటువంటి వారిని వెలికితీసి వారిలో ఉన్న టాలెంట్ సింగింగ్, మిమిక్రీ, కామెడీ, మ్యూజిక్ ఇలాంటి అంశాలలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ఎఫ్ఎం ను అభినందించారు. తెలంగాణ ఎఫ్ఎమ్ అనతికాలంలోనే ప్రజలందరికీ ఎంతగానో చేరువైందని ప్రతి ఒక్కరూ తెలంగాణ ఎఫ్ఎం సేవలను వినియోగించుకోవాలని ఇంకా ముందు ముందు కాలంలో మరింత మెరుగైన సేవలు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని సిద్దిపేట ప్రజలందరూ తెలంగాణ ఎఫ్ఎంను ఆదరిస్తున్నందుకు తెలంగాణ ఎఫ్ఎం నిర్వాహకులు శశిధర్ ఆనందం వ్యక్తం చేశారు.