సినీనటి జ్యోతిలక్ష్మి ఇకలేరు

jyothi-diesకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అలనాటి నటి జ్యోతిలక్ష్మి(57)చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు . 1958 డిసెంబర్ 22న జన్మించిన జ్యోతిలక్ష్మి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ , తమిళ భాషలలో కలిపి మొత్తం 1000కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది . ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన జ్యోతి లక్ష్మి 1963లో ‘పెరియ ఇడతు పెన్’ అనే తమిళ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసింది. తెలుగులో జ్యోతి లక్ష్మి తొలి చిత్రం ‘పిల్లా పిడుగా’.. గాంధర్వకన్య, సీతారాములు, బెబ్బులి, కలుసుకోవాలని దొంగరాముడు, బంగారు బాబు, స్టేట్ రౌడీ, బిగ్ బాస్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది . అనేక చిత్రాలలో ఐటెం సాంగ్స్ లలో నటించిన జ్యోతి లక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న జ్యోతి లక్ష్మి హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని కన్నమ్మ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నారు.